తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్
2,91,159 బడ్జెట్లో రైతు భరోసా, దళితబంధు, గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారులకు భరోసా, తదితర పథకాలకు కేటాయింపులే లేవు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని.. బడ్జెట్ వాస్తవానికి దూరంగా ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు’ను ఎగ్గొడదామని చూస్తున్నారు..! ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ‘రైతు వ్యతిరేక ప్రభుత్వం..!
రైతులనే కాదు, కౌలు రైతులు, రైతు కూలీలు, మోసం చేసిన ప్రభుత్వం..!
వ్యవసాయం రంగంపై కూడా బడ్జెట్ నిరుత్సాహపరిచే విధంగా ఉంది..!
ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసినట్లు బడ్జెట్..!
ఈ ప్రభుత్వం ఏ ఒక్క పాలసీని తయారు చేయలేదు..!
ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకు నిరాశే…!
ప్రభుత్వానికి పాలసీ లేదని బడ్జెట్ చూసిన తర్వాత అర్థమైంది.
ఒక్క పాలసీ కూడా స్పష్టంగా లేదు..!
రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ, పేద వర్గాలకు సంబంధించిన వాటిపై పాలసీలు ఏంటి? అనే ఏ ఒక్కదానిపైన స్పష్టత లేదు..!
ఏ కొత్త సంక్షేమ పథకాలు కూడా లేవు..!
కళ్యాణ లక్ష్మీ తులం బంగారం ఇస్తారో ఇవ్వరో దానిపై స్పష్టత లేదు..!
రైతులను పొగిడినట్లే పొగిడి, వెన్ను పోటు పొడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్..!
తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదు…!
గతంలో వ్యవసాయాన్ని బంగారంగా తీర్చి దిద్దితే…! ఈ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం…
ధాన్యం కొనుగోలు, విద్యుత్, నీరులు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతావున్నరు.
ధాన్యం కొనుగోలు, విద్యుత్, నీటి సరఫరా చేయడంలో విఫలం అయింది.
వ్యవసాయ సాగునీరు అందించడం లో విఫలం పంటలు ఎండిపోతే నష్టపరిహారం అందించడంలో విఫలం..
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 హామీలకు అతిగతీ లేదు…
కాంగ్రెస్ పార్టీ సర్కార్ చేసింది ఏమీ లేదు….! గొప్పలు చెప్పుకోడానికి ప్రయత్నించిందిగా ఈరోజు ఆర్థిక ప్రసంగం, రాజకీయ ప్రసంగంలా ఉంది,..!