ఊరంతా పాములు- వాటితోనే పిల్లల ఆటలు

ఊరంతా పాములు- వాటితోనే పిల్లల ఆటలు

చిన్న పాము కనిపిస్తేనే.. ‘అమ్మో పాము’ అంటూ ఆమడ దూరం పారిపోతాం. అదే ఊరికి ఊరే సర్పాలకు అడ్డా అయితే? ఇది ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది కదా! కర్ణాటకలోని ఆ గ్రామస్థులంతా పాములతో సహజీవనం చేసేవాళ్లే. అది కూడా కోబ్రాలతో.. మరి అలాంటి ఊరు గురించి తెలుసుకోవాలని ఉందా?

ఆ ఊరు కోబ్రాలకు నిలయం(home to cobra snakes). ఇంట్లో పెంచుకునే శునకాలతో, పిల్లులతో ఆడుకున్నట్లు.. చిన్నపిల్లల నుంచి పెద్దలు వరకు ఆ ఊరిలో పాములతో సరదాగా గడుపుతుంటారు. అయితే.. ఇంతవరకు సర్పాలతో వారికి ఎలాంటి సమస్యలు రాలేదట. ఇంకా చెప్పాలంటే.. ఏ ఒక్కరూ పాము కాటుతో చనిపోలేదట! ఇది నిజమేనా? ఇదేం ఊరురా బాబు..? అని మీకు అనిపించక మానదు! ఆ ఊరు పేరే నాగెనహళ్లి. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఉంది.

నాగనహళ్లి.. చిన్నగిరి తాలూక పరిధిలో ఉంది. ఈ ఊరునే స్థానికంగా ‘పాముల గ్రామం(village of snakes)’ అని పిలుస్తారట. ఇది చదవగానే అర్థమైయ్యే ఉంటుంది.. ఆ గ్రామంలో ఎన్ని పాములుంటాయో లెక్కేలేదు. అంతేకాదు మనుషులతో పాటు అవీ కలిసే తిరుగుతాయి. ఆ ఊరులోని చిన్నపిల్లలు.. ఆంజనేయ, శివాలయాల వద్ద సర్పాలతో ఆడుకుంటారు.
పాములు ఎప్పుడూ మనుషులతో కలిసే ఉంటాయి. తరుచూ చుట్టం చూపుగా వచ్చి పోతుంటాయి. అలా రావడం ఆంజనేయ, ఈశ్వరుడు చేస్తున్న అద్భుతాలని వారి నమ్మకం. పురాతన కాలం నుంచీ ఇలాగే జరుగుతుందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు సర్పాలతో ఎలాంటి సమస్యలు ఎదురవలేదని అంటున్నారు.

పాము కాటుకు ఆంజనేయ తీర్థం

ఒకవేళ పాము కరిచిస్తే.. ఆంజనేయ తీర్థం తీసుకుంటే నయం అయిపోతుందట. ఆంజనేయ గుడిలో మూడు రోజుల పాటు ఉంటూ.. తీర్థం తాగితే నయం అయిపోతుందని వారు నమ్ముతారు.

పాములకు అంత్యక్రియలు.
.
ప్రమాదవశాత్తూ సర్పాలు చనిపోతే.. మనుషులకు చేసినట్లే గ్రామస్థులంతా కలిసి వాటికి అంత్యక్రియలు చేస్తారు.

మరి ఆ ఊరు నీ ఒక్కసారి చూసి వద్దామా.

సమాచారం సేకరణ

మీ… సుబ్బారావు గాలంకి సైన్స్ యాత్ర శాస్త్ర సాంకేతిక విభాగం… హైదారాబాద్.