అమ్మ నీకు వందనాలు… మహిళగా పుట్టడమే నేరమా…!!
పురిటి నొప్పులు అబార్షన్ ఆపరేషన్లు, ఈ సమాజానికి మేము దౌర్భాగ్యులమా!!
డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భవతి ఆవేదన!!
గర్భిణీ స్త్రీ మరణం ధర 4 లక్షలు
ఈ దేశం ఈ రాష్ట్రం డిజిటల్ ఇండియా బంగారు తెలంగాణ బంగారు భవిష్యత్తు రకరకాల విజన్ పేరుతోనా పాలక ప్రభుత్వాలు పబ్బం కడుక్కోవడం తప్ప ఈ రాష్ట్రంలో వినబడ తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయని సంగతి ఎందుకు నిదర్శనం.
వనపర్తి జిల్లా పరిధిలోని పెబ్బేరు మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామానికి చెందిన పుష్పలత వయసు 20 సంవత్సరాలు నిండు గర్భవతి మొట్టమొదటి కాన్పు పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమెకు వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె ఈరోజు కన్నుమూసి తన ప్రాణాన్ని ఈ దేశానికి తెలంగాణ ప్రభుత్వానికి అంకితం చేసింది.
ఇది కాదంటారా,! ఒక్కసారి ఆలోచించండి కటిక దారిద్రంతో పేద ప్రజలు వైద్యం , విద్య , ఆరోగ్యం , వ్యవసాయం , ప్రధానంగా వీటిపై ఆధారపడి జీవిస్తున్నారు.
ఇలాంటి సామాన్య ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ మొక్కుబడిగా ఆ నిధులు దారి మళ్లిస్తూ ఆచరణలో అమలు చేయకపోవడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్లు పేద ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందించకపోతున్నారని.
అందుకే ప్రజలు కాయే కష్టం చేసుకుని ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా తమ ప్రాణాలు గాలికి పోతున్నా కూడా ఎందుకు ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని.
పెబ్బేర్ ఆస్పత్రిలో మరణించిన నాగసర్న్ పల్లి గ్రామానికి చెందిన పుష్పలత ప్రభుత్వం ప్రశ్నిస్తుంది.
దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి , ఇంత అన్యాయం జరిగిన కూడా పోలీసులు , జర్నలిస్టులు తనకు ధరిని అన్యాయంపై న్యాయం చేయకుండా అన్యాయం చేస్తూ బెదిరిస్తూ నా శవాని వెంటనే నా గ్రామంలో దాన సంస్కారాలు చేయాలని పోలీసులు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం చివరకు ఎంతోమంది వచ్చినప్పటికీ నా శవం పైన నాలుగు లక్షల వేలం కట్టిస్తూ పోలీసులు ప్రజాప్రతినిధులు , జర్నలిస్టులు నాకు అన్యాయం చేశారని ఆమె ఇప్పటికీ కూడా అనంత లోకాలకు ఒక ముందే తన ఆత్మలో ఉన్న విశ్వాసాన్ని తన బాధను ఈ సమాజానికి తృణపాయంగా వదిలి పెడుతున్నానని ప్రకటించింది.
పేద ప్రజలు ఆరోగ్య వైద్య సేవల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రైవేట్ ఆస్పత్రిలో కార్పొరేట్ ఆసుపత్రిలో అన్ని రకాల చికిత్సలు పొందాలని ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 5 లక్షల వరకు ఉన్న పరిమితిని 10 లక్షల పెంచిన కూడా అందులో ప్రధానంగా గర్భిణీ స్త్రీల కోసం సిజరిన్ ఆపరేషన్.
ఎందుకు పెట్టలేదని ఒకవేళ పెట్టినట్టు ఉంటే నా ప్రాణం ఎందుకు పోతుందని ఆమె ప్రశ్నిస్తుంది.
ప్రజలను మాయమాటలకు గురిచేసి 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం ప్రభుత్వం సూచించిన పరీక్షలు ఆపరేషన్లు.
ప్రైవేట్ ఆస్పత్రిలో పేద ప్రజలకు దొరకపోవడం ఇదే నిదర్శనం ఎవరు చనిపోయిన వనపర్తి నియోజకవర్గం లో ప్రతిక్షణం లో ఎమ్మెల్యే మేఘా రెడ్డి 5వేల నుంచి పదివేల వరకు ఆర్థిక సాయం అందించి మొక్కుబడిగా చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఎమ్మెల్యేకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వనపర్తి జిల్లాలో,వనపర్తి నియోజకవర్గం లో ప్రైవేట్ ఆస్పత్రిలో జరుగుతున్న నిలువు దోపిడి పైన ఎందుకు శ్రద్ధ పెట్టలేదని పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు అమాయకులు కారు అందుకే గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూతుర సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఎమ్మెల్యేలు ,మంత్రులు ,ఎంపీలు గుర్తుపెట్టుకోవాలని ప్రజలు ఈ సందర్భంగా సూచిస్తున్నారు.
పెబ్బేర్ ప్రైవేట్ ఆస్పత్రిలో 20 సంవత్సరాల మొట్టమొదటి కాన్పు కల్లారా చూడకముందే తన పుట్టిన బిడ్డను వదిలిపెట్టి ఈ ప్రభుత్వానికి దేశానికి చేస్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు రోదనలతో ఆకృతంతో ఆవేశంతో బోరున విలపించి అంకితం చేశారు.
ఆడపిల్లగా పుట్టడమే నేరంగా నాకు జరిగిన అన్యాయం మరొక ఆడపిల్లకు జరగవద్దని మృతురాలు చనిపోయినప్పటికీ తన ఆత్మను ఈ ప్రపంచానికి దేశానికి సందేశం పంపించారు.
ఏమి తెలియని యాదవ కుటుంబంలో జన్మించిన పుష్పలత మరణం పట్ల యాదవ కుల సంఘాలు , బీసీ కుల సంఘాలు , ఎవ్వరు కూడా పట్టించుకోవడంలేదని ఆమె కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తీవ్ర ఆవేదనలో ఆవేశంలో వణికి పోతున్నారు.
ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఇప్పటికి ఎన్నో జరిగిన కూడా వనపర్తి జిల్లాల్లో కూడా ఎన్నో జరిన కూడా సంబంధిత వైద్యశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ప్రజా సంఘాల నాయకులు, అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఎక్కడ ఉన్నారని మరణించిన గర్భవతి ప్రశ్నిస్తుంది.
దీనికి సమాధానం చెప్పాలి, అనవసరమైన విషయాల పట్ల పార్టీల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు , వామపక్ష పార్టీల నాయకులు ,ప్రజాసంఘాల నాయకులు , మహిళా సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని దీనికి సమాజానికి సమాధానం చెప్పాలి.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మహిళల పట్ల , గర్భిణీ స్త్రీల పట్ల మహిళల వేధింపుల పట్ల , ఎన్నో చట్టాలు వచ్చినా కూడా ఆ చట్టాలు చుట్టాలుగా మారిపోతున్నాయని పదేపదే విమర్శలు వస్తున్నాయి , ఇలాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో కట్టుదితమైన చర్యలు తీసుకుంటామని బోగస్ ప్రసంగాలు.
ఊక దుంపుడు ప్రచారం మానుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మరణించిన నిండు గర్భవతి పుష్పలత కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే, వెంటనే 20 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసే ఆదుకోవాలని ఆ మండల ప్రజలు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.