ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులతో ఆగస్టు 2న CM రేవంత్ రెడ్డి సమావేశం…!!
హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన 30 వేల మంది ఉపాధ్యాయులతో సీఎం రేవంత్రెడ్డి సమావేశం కానున్నారు.
ఈ సమావేశ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..
ఆగస్టు 2న ఎల్బీస్టేడియంలో జరిగే సమావేశంలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులందరితో సీఎం నేరుగా మాట్లాడేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ఇక ఎల్బీస్టేడియంలో దాదాపు రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయాలని అధికారులకు సూచించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు సరైన పార్కింగ్, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
సమావేశ ప్రాంగణంలో అవసరమైన మంచినీరు, పారిశుధ్యం తదితర సౌకర్యాలు కల్పించాలని సూచించారు.