సీనియర్ శాసన సభ్యులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి CM రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి… నిరంజన్ రెడ్డి
రేవంత్ రెడ్డి గారిది ఉన్మాద భాష…ముఖ్యమంత్రి పదవికి కళంకం.
ముఖ్యమంత్రి పదవి హుందాతనాన్ని కాపాడాలి…ప్రతిపక్షాలను గౌరవించాలి.
మీ పుట్టినిల్లు బి.ఆర్.ఎస్ మరవద్దు అని హితవు.
అహంకారంతో మాట్లాడితే అంతం కాక తప్పదు… సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి మాజీ మంత్రివర్యులు.
మాజీ మంత్రి,సీనియర్ శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా అక్కలను నమ్ముకుంటే మునుగుతారు,బతుకు బస్ స్టాండ్ అవుతుందని అవమానించిన సి.ఎం.రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని గౌరవ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాక రైతులు,నిరుద్యోగులు, అగన్వాడి టీచర్లు,ఆశా కార్యకర్తలు,ఆరోగ్య కార్యకర్తలు,ఆటో యూనియన్ కార్మికులు ఒకవైపు ఆందోళనలు చేస్తుంటే వారి దృష్టి మారాల్చడానికి సంబంధం లేకుండా రాజకీయ ప్రేరిపిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు.
క్షుద్రరాజకీయాలే శరణ్యంగా ఉన్న రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి మునిగిపోవడం ఖాయమని అన్నారు.
బి.ఆర్.ఎస్ M.L.A ల ఇండ్లులుకు వెళ్లి బేరసారాలు ఆడుతున్న రేవంత్ రెడ్డికి బి.ఆర్.ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.
గతములో చట్టబద్ధంగా బి.ఆర్.ఎస్ పార్టీ M.L.Aలను విలీనం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే అని అన్నారు.
హోల్ సేల్ గా రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆరోపించారు.
రాజకీయాలలో ఓటమి గెలుపులు సహజమని అహంకారం పనికిరాదని 2018ఎన్నికలో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్న మాటకు మీరు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు.
పాలన శూన్యం చేసి హామీలు అటకెకించి కాలయాపన చేస్తూ నమ్మిన ప్రజలను మోసం చేశారని అన్నారు.
కాబట్టి వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారితో పాటు రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని నిరంజన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు.
ఈ సమావేశములో గట్టు యాదవ్,బి.లక్మయ్య,వాకిటి.శ్రీధర్,పి.రమేష్ గౌడ్,మాణిక్యం,విజయ్ కుమార్ నందిమల్ల.అశోక్,కౌన్సిలర్స్ కంచె.రవి,నాగన్న యాదవ్, ఉంగ్లమ్. తిరుమల్,ప్రేమ్ నాథ్ రెడ్డి,సూర్యవంశపు.గిరి, జోహెబ్,చిట్యాల.రాము తదితరులు పాల్గొన్నారు.