నాగర్ కర్నూల్ లో గంజాయి కలకలం…!! నల్లమల్లలో రహస్య ప్రాంతాల్లో గంజాయి తోటలు…!!
మాటకద్రవ్యాల పై నాగర్ కర్నూల్ డీఎస్పీ ఉక్కు పాదం!!
గత కొంతకాలం నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గంజాయి అమ్మకాలు చాప కింద నీరు లాగా కొనసాగుతున్నాయి.
ఇప్పటికి రెండుసార్లు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది,ఈ విషయం పట్ల నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఉక్కు పాదం మోపారు.
ఇటీవల నాగర్ కర్నూల్ బస్టాండ్ లో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం మరచిపోక ముందే మళ్ళీ తిరిగి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ విషయం పట్ల డిఎస్పి రంగ ప్రవేశం చేసి గంజాయి విక్రయాలతో పాటు మాదకద్రవ్యాల పైన ప్రత్యేక నిఘ పెట్టి నియంత్రణించడంలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టు తెలిసింది.
నల్లమల్ల అటవీ ప్రాంతం సమీపము లో ఉన్న నాగర్ కర్నూల్ తో పాటు , కొల్లాపూర్ ,అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గం కూడా గంజాయి రాష్ట్రంగా గుట్టు చప్పుడు కాకుండా విక్రయాలు కొనసాగుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తుంది.
దీనికి ప్రధాన కారణం నాగర్కర్నూల్ జిల్లా లోని పై నియోజకవర్గాలు నల్లమల్ల అటవీ ప్రాంత సమీపంలో ఉండడం నల్లమల్లలో జీవిస్తున్న గిరి పుత్రులు.
చెంచులు , గిరిజనులు నల్లమల్ల అడవులలో గంజాయి సాగు విక్రయిస్తూ ఉపాధి పొందుతూ జీవనోపాధి కోసం పాటుపడుతున్నట్లు తెలుస్తుంది.
మాదకద్రవ్యాలలో వివిధ రకాలు ఉంటాయని అందులో నల్లమందు , మార్ఫిను , హెరాయిన్ , చరస్ , మరి జువాన , కో కాయిన్ , ఎల్ ఎస్ డి మొదలైన ముఖ్యమైన మదకద్రవ్యాలు నల్ల బజార్ లో విక్రయిస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.
మాదకద్రగాల నిరోధించేందుకు భారత ప్రభుత్వం నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్స నన్స్ చట్టం ప్రవేశపెట్టినప్పటికీ ఇప్పటివరకు ఎన్ని చట్టాలు ఉన్నా మాదకద్రవ్యాల నియంత్రణ అదుపు కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఏదో ఒకచోట గంజాయి మదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు పట్టుబడినట్లు రోజుకు ఒక విషయం తెలుగులోకి వస్తుంది గంజాయి మాటున యువత బలైపోతున్నారు, గంజాయి తో పాటు కొత్త పద్ధతిలో చాక్లెట్ ఆయిలు రూపంలో మత్తు పదార్థాలను వివిధ కిరణా షాపులలో విక్రయిస్తున్నారని కూడా తెలుస్తుంది.
మాదకద్రవ్యాల వాడకం వల్ల మనిషి జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతూ మానవుని జీవితానికి పేరు ముప్పుగా వాటిల్లుతుంది.
జూన్ 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా మొక్కుబడిగా చేపట్టి అధికార యంత్రాంగం చేతులు దులుపుకున్నదాని విమర్శలు వస్తున్నాయి.
మాదకద్రవ్యాలను నియంత్రణ కోసం నార్కోటిక్స్ కంట్రోల్ నిషేధించడానికి బ్యూరో సమస్యలు కృషి చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యం.
2019లో నార్కోటిక్స్ ఆర్డినేషన్ సెంటర్ ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.
ఆ తర్వాత రాష్ట్రాలలో వివిధ విభాగంలో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఎంత ప్రయత్నించినా యుదేక్షగా విక్రయాలు కొనసాగుతున్నాయి.
మాదకద్రవ్యాల మూలంగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే మత్తు పదార్థం దాని డ్రగ్స్ అని కూడా అంటారు.
ప్రమాదకరమైన వ్యసనం నేటి సమాజంలో యువత దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపించే దురావాలని ఈ మాదకద్రవ్యాల వినియోగం తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ధూమపానం మద్యపానం వంటి వ్యసనాల కన్నా మాదకద్రవ్యాలు తీవ్ర ప్రభావానికి చూపిస్తున్నప్పటికీ యువత మత్తు వదలకుండా నిద్ర మత్తులో ఏ సమయంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికీ వివిధ ప్రాంతాలలో రోడ్ల పైన వీరంగం చేస్తున్నా కూడా పట్టించుకునే నాధుడు లేడని విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా సిగరెట్ లో గంజాయి కలుపుకొని టీ పాయింట్ల దగ్గర 20 సంవత్సరాలు కూడా నిండని యువత సిగరెట్లు గంజాయిని కలుపుకొని సేవిస్తున్నారని ఈ విషయంపై పోలీసులు నాగర్ కర్నూల్ ,వనపర్తి, కొల్లాపూర్, అచ్చంపేట , కల్వకుర్తి నియోజకవర్గం అధికంగా గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం.
రక్ష సేవించిన యువకులకు డ్రగ్స్ అడిక్షన్ కేంద్రాల లో మానసిక వైద్య ద్వారా చికిత్సలు అందించేందుకు అవగాహన సతస్సులు ఏర్పాటు చేయాలని.
పోలీసులు, సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు, అటవీ శాఖ అధికారులు, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతరం కృషి చేయాలని గంజాయి విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.