షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు పై తీవ్రంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండి పడ్డారు..!
షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత నీచమైనదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండి పడ్డారు..!
నేరం ఒప్పుకోవాలంటు మహిళా అని కూడా చూడకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా..? ఇదెక్కడి ఇందిరమ్మ రాజ్యం…?
క్రమశిక్షణ నేర్పే పోలీసులు.. క్రమశిక్షణ తప్పుతుంటే… చోద్యం చూస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్..!
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లో దళిత మహిళపై ఇంత చిన్న చూపా.. దళితుల మనుషులు కాదా..!
సమాజం తలదించుకునేలా ఈ సంఘటన..! రక్షించాల్సిన పోలీసులతో రక్షణ లేని పరిస్థితి ఈ కాంగ్రెస్ పాలనలో…!
వెంటనే ఈ దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు..!
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత మహిళలకు న్యాయం చేయాలని వెల్లడించారు. దళిత వ్యతిరేక.. మహిళా వ్యతిరేక కాంగ్రెస్ సర్కారును తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదన్నారు..!
అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి గారు మరియు మంత్రులు ఆడబిడ్డలను (ఎమ్మెల్యేలు) అవమానిస్తుంటే..! తామేమీ వారికి తీసిపోమని షాద్నగర్లో దళిత మహిళపై పోలీసులు చేసిన దాడిని
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా ఖండించారు…!
దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ ప్రయోగిస్తారా ప్రశ్నించారు ..!
విధి నిర్వహణలో వచ్చే వేతనం సరిపోవడం లేకనే…! ఇలాంటి అప్పనంగా వచ్చే డబ్బులపై ఆశ పడుతున్నారు..! దానికి ఉదాహరణ నే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలిస్ స్టేషన్ లో జరిగిన సంఘటన…!
రికవరీ సొమ్ము కోసం ఆశపడి పిర్యాదుదారుడితో కుమ్మక్కయి ఓ దళిత మహిళ అని చూడకుండా చిత్రహింసలకు పాల్పడ్డారు..!
ఈ ఘటనలో సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న కారణంగా, ఈ సంఘటన బయటికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు…!
ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు..! వాళ్లను గౌరవించకపోయినా ఫర్వాలేదు. ఇలా దౌర్జన్యాలు మాత్రం చేయకండి..!