కొడుకుని చదివించి CI చేస్తే… ఆస్తి కోసం తల్లిదండ్రులను కొట్టిన CI నాగేశ్వర్ రెడ్డి
తన కొడుకు నుండి రక్షణ కల్పించాలని డీజీపీకి ఫిర్యాదు చేసిన సీఐ తల్లిదండ్రులు.
వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం వెంకటాయింపల్లి గ్రామానికి చెందిన రఘునాధ్ రెడ్డి, బొజ్జమ్మ దంపతుల పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐ, చిన్నకొడుకు యాదయ్య కానిస్టేబుల్, ఇద్దరు కూతుళ్లు.
పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ మల్టీ జోన్ 2లో సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
రఘునాధ్ రెడ్డి తన ఆస్తి 30 ఎకరాల 23 గుంటలలో పెద్దకొడుకు పేరుపై 15 ఎకరాలు, చిన్న కొడుకు పేరుపై 11 ఎకరాలు, మిగతా భూమి కూతుళ్లకు ఇద్దామని పెట్టుకున్నాడు.
15 ఎకరాల భూమి తీసుకున్న పెద్ద కొడుకు సీఐ నాగేశ్వర్ రెడ్డి ఇంకో 5 ఎకరాలు కావాలని తల్లిదండ్రులను కొడుతూ, హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై చిన్నకొడుకు ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు.
దీంతో తమ పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి నుండి తమకు ప్రాణహాని ఉందని, అతని నుండి రక్షణ కల్పించి, అతనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.