జగిత్యాల జిల్లా…
ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేస్తున్న ఘరానా దొంగ మరియు అట్టి వాహనాలు కొన్న ఇద్దరు నిందితుల అరెస్ట్
6 లక్షల విలువ గల 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన జిల్లా SP అశోక్ కుమార్ IPS గారు
జగిత్యాల జిల్లా పరిధిలోని మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల టౌన్, గొల్లపల్లి మరియు నిజామాబాదు జిల్లా పరిధిలోని ఆర్మూర్, కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో గత కొంతకాలంగా హండిల్ లాక్ వేయని ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను మరియు అట్టి దొంగ సొత్తును కొన్న మరో ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీసులు. వీరి నుండి ఇరువై(20) ద్విచక్రవాహనాల (వాటి విలువ ఆరు లక్షల రూపాయలు) పోలీస్ వారు స్వాదినం చేసుకున్నారు.
ఈ అరెస్ట్ కి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు వెల్లడిస్తూ……. నిజామాబాదు జిల్లా ఏర్గట్ల మండలం, గుమ్మిర్యాల గ్రామానికి చెందినా నిందితుడు (A-1) మన్నే లక్ష్మన్ S/O పోశెట్టి, వయస్సు:45yrs, కులం: ST-నాయకపోడ్ అనే వ్యక్తి గతంలో ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేసుకుని జీవించేవాడు, ఈ క్రమంలో ఒక ప్రమాదంలో అతని కాలు విరగడంతో డ్రైవర్ వృత్తి మానేసి, ఖాళీగా తిరుగుతూ మద్యానికి మరియు జల్సాలకు అలవాటు పడి, సులువుగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశ్యంతో ఏదైనా దొంగతనాలు చేయాలని, అలా దొంగతనం చేసిన సొత్తు ని అమ్మటం ద్వార వచ్చే డబ్బుతో జల్సాలు చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో హండిల్ లాక్ వేయని బైక్ ల దొంగతనం అయితే సులువుగా ఉంటుందని అనుకుని బైక్ లని దొంగతనం చేయడానికి నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను ముఖ్యంగా సాయంత్రం సమయంలో చీకటి పడినాక జన సంచారం ఎక్కువగా ఉండే మార్కెట్ ఏరియా, హాస్పిటల్స్ ముందు, బస్సు స్టాండ్స్ వద్ద, మరియు వివిధ షాప్ ల ముందు ద్విచక్రవాహనదారులు హడావిడిలో వారి వాహనాలకి హండిల్ లాక్ వేయకుండా మరిచిపోయిన బైక్ లే లక్ష్యంగా ద్విచక్రవాహనాలను దొంగతనం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. ఇందుకుగాను నిందితుడు(A-1) ముందుగ వివిధ రకాల మోటార్ సైకిల్ లకి సంబందించిన తాళం చేవిలని సేకరించి వాటి సహాయంతో మోటార్ సైకిల్ చోరిలకి పాల్పడేవాడు.
ఈ విధంగా గత సంవత్సరo నుండి నుండి నిందితుడు (A-1) జగిత్యాల మరియు నిజమాబాద్ జిల్లాలలో మొత్తం (20) ద్విచక్రవాహనాలు చోరికి పాల్పడినాడు.
మొత్తం స్వాధీనం చేసుకున్న వాహనాల సంఖ్య 20.
జిల్లాల వారిగా పోలీస్ స్టేషన్ వారిగా వాటి వివరాలు….
జగిత్యాల జిల్లా:మొత్తం (13) ద్విచక్రవాహనాలు
మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో(4)
కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో (1)
జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో (6)
రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ()
సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో (1)
నిజామాబాదు జిల్లా:మొత్తం (7) ద్విచక్రవాహనాలు…
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో(3)
నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో(3)
కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో (1)
ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్రవాహనాలని నిందితుడు (A-1) నిర్మల్ జిల్లా, మమడ మండలం, పొంకల్ గ్రామానికి చెందినా, నిందితుడు(A-2) మొహమ్మద్ మోసిన్, తండ్రి పేరు: ఇక్బాల్, వయస్సు: 27 సం. కులం: ముస్లిం, వృత్తి: చికెన్ షాప్ నిర్వహణ మరియు నిందితుడు(A-3) అబ్దుల్ రషీద్, తండ్రి పేరు: ఖాదిర్, వయస్సు: 26 సం. కులం: ముస్లిం, వృత్తి: బైక్ మెకానిక్ షాప్ నిర్వహణ అనువారికి చెరో (10) ద్విచక్రవాహనాలని ఒక్కో ద్విచక్రవాహనాన్ని 8,000 నుండి 10,000/- రూపాయల చొప్పున అమ్మి వచ్చిన డబ్బులని తన జల్సాలకి ఖర్చు చేసేవాడు.
నిందితులు (A-2) మరియు (A-3) లు నిందితుడు (A-1) వారికీ అమ్మిన ద్విచక్రవాహనాలు దొంగ సొత్తు అని తెలిసికూడా వాటిని నిందితుడు (A-1) వద్ద తక్కువ ధరకు కొని వాటిని గ్రామంలోని అమాయక ప్రజలకి ఎక్కువ ధరకి అమ్ముకునే వారు మరియు ఎవరైనా ద్విచక్రవాహనాల పేపర్స్ అడిగితే వారికీ రేపు ఇస్తాము, మాపు ఇస్తాము అని మబ్య పెట్టి తప్పించుక తిరిగేవారు.
గత కొంత కాలంగా జరుగుతున్న ద్విచక్రవాహనాల చోరిలపై ప్రజల నుండి వచ్చిన పిర్యాదు మేరకు పోలీస్ వారు ప్రత్యేకంగా దృష్టిసారించి జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, IPS గారి ఆదేశాల మేరకు, మెట్పల్లి డీఎస్పీ శ్రీ ఉమా మహేశ్వర్ రావు గారి పర్యవేక్షణ లో, మెట్పల్లి సిఐ శ్రీ నిరంజన్ రెడ్డి గారు మరియు మెట్పల్లి ఎస్సై చిరంజీవి మరియు వారి సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీ ని ఉపయోగించుకుంటూ, ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం వెతుకుతుండగా ఈ రోజు అనగా తేది:.10-08-2024, at 12:00hrs . మెట్పల్లి లోని వెంకటరావుపేట్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో ఒక ద్విచాక్రవహనం పైన వస్తున్న నిందితున్ని(A-1) పట్టుకొని విచారించగా నిందితుడు (A-1) ఇదివరకు పాల్పడిన ద్విచక్రవాహనాల చోరిలని అంగీకరించాడు మరియు నిందితుడు (A-1) ఇచ్చిన సమాచారం తో మిగతా నిందితులు (A-2 & A-3) ల దొంగ సొత్తు(ద్విచక్ర వాహనాలు) కొన్న వారిని అరెస్ట్ చేయడం తో పాటు చోరికి పాల్పడిన ద్విచక్రవాహనాలని(20) వారి వద్ద రికవరీ చేయనైనది.
ఇట్టి ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న నిందితుడిని మరియు దొంగ సొత్తు కొన్న నిందితులని చాక చక్యంగా పట్టుకున్న మెట్ పల్లి సిఐ శ్రీ. నిరంజన్ రెడ్డి మరియు ఎస్సై శ్రీ. చిరంజీవి, కానిస్టేబుల్స్ కిరణ్ మరియు సంతోష్ లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.
ఈ యొక్క విలేకరుల సమావేశంలో డిఎస్పి ఉమామహేశ్వర రావు, మెట్పల్లి సి.ఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.