ఉఫయోగంలో లేని బంజరదొడ్డి పేరుతో పైసా వసూల్

ఉఫయోగంలో లేని బంజరదొడ్డి పేరుతో పైసా వసూల్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామపంచాయితీ పరిధిలో ఉఫయోగంలో లేని బంజరదొడ్డికి గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు బంజరదొడ్డికి మరమత్తులు చేయకపోగా కనీసం గేటు కూడా లేనీ ధీనా పరిస్థితిలో ఉంది

డబ్బా గ్రామపంచాయితీలో బారేగూడా గ్రామానికి చెందిన రైతు గుర్లె విలాస్ రెండు ఎకరాలు కౌలుకు పట్టిన పొలంలో 14 దుడ్డెలు పొలాన్నీ నాశనం చేయడంతో గ్రామపంచాయితీ సిబ్బంది బంజరదొడ్డి పేరుతో అంబేద్కర్ భవనం పరహారి లోపల పశువులను చొరగొట్టి పైసలు వసూల్ చేసి డుబ్లికేట్ రసీదు పైనా కనీసం పశువుకు ఎంత అనేది రాయకుండా మోసాలకు పాటుపడుతున్న డబ్బా గ్రామపంచాయితీ సిబ్బంది ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

కొంతమంది గ్రామ పెద్దలు గ్రామస్థులు యువకులు నష్టపోయిన రైతుకు పరిహారం అందించేలా పంచాయతీ నిర్వహిస్తుండగా గ్రామ పంచాయతీ సిబ్బంది మాముల్లకు కకృతి పడి ఎలాంటి రసీదులు చింపకుండ 14దుడ్డేలను వదిలేసి నష్టపోయిన రైతుకు అన్యాయం చేసిన గ్రామ పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా గ్రామస్థులు

డబ్బా గ్రామ ప్రజలు స్పందించి నష్టపోయిన కౌలు రైతును ఆదుకోవాలని అదే విధంగా మోసాలకు పాలుపడుతున్న సిబ్బంది పైనా వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల డిమాండ్ చేశారు