నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇస్రో ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులు… నేర్చుకుంటే జాబ్ గ్యారెంటీ…!!
ప్రస్తుత టెక్ వరల్డ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వంటి టెక్నాలజీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి ఆధిపత్యం మరింత పెరగనుంది. ఏఐ, ఎంఎల్ విభాగాలపై పట్టు సాధించిన వారికి మంచి ఉద్యోగవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఇస్రో, ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
ఇస్రో AI, ML టెక్నాలజీపై ఐదు రోజుల ఫ్రీ ఆన్‌లైన్ కోర్సును ఆగస్టు 19 నుంచి ప్రారంభించనుంది. IIRS ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కోర్సును ఆఫర్ చేస్తోంది. అంతరిక్ష రంగంలో సరికొత్త ఆవిష్కరణలే లక్ష్యంగా విద్యార్థులను ప్రోత్సహించనుంది. ఇస్రో 2017లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఏటా ఒక్కో అంశంపై ఉచిత కోర్సును అందిస్తోంది. ఐఐఆర్‌ఎస్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌ను ఇస్రో 3,500 పైగా నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌లకు విస్తరించింది. జియోస్పేషియల్ టెక్నాలజీ, దాని అప్లికేషన్లలో కెపాసిటీ బిల్డింగ్‌ను ప్రోత్సహించడంలో ఈ ప్రోగ్రామ్ కీలకపాత్ర పోషిస్తోంది.