సస్పెన్షన్ కు గురైన ఇన్స్పెక్టర్ రాంరెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

సస్పెన్షన్ కు గురైన ఇన్స్పెక్టర్ రాంరెడ్డి పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

బాధితురాలు సునీత వెల్లడి

సునీతపై సైబరాబాద్ కమిషనర్ కు మరో బాధితుడు నాగేందర్ ఫిర్యాదు.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో దొంగతనం కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న హరిజన వాడకు చెందిన మల్కాపురం సునీత ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చోక్కంపేట ఆంజనేయులు తెలిపారు. ఇటీవల దొంగతనం కేసులో సునితను అదుపులోకి తీసుకొని థర్డ్ డిగ్రీ చేశారని ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విధితమే. ఇప్పటికే డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డి తదితర కానిస్టేబుల్ లపై సస్పెన్షన్ వేటును పోలీసు ఉన్నతాధికారులు వేశారు. అయితే ఈ వ్యవహారంలో సంఘటన జరిగిన 20 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదును సునీత చేశారు. తనను పోలీసులు కొట్టారని ఇన్ని రోజులు చికిత్స పొందుతున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

సునీతపై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు.

హరిజనవాడకు చెందిన సునీత పై బంగారం చోరీ కేసుకు సంబంధించి సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో హరిజనవాడకు చెందిన దళిత బాధితుడు నాగేందర్ లిఖితపూర్వక ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తన ఇంట్లో 24 తులాల బంగారం రెండు లక్షల నగదు సునీత దొంగతనం చేసిందన్న వ్యవహారంలో ఆయన ఉన్నతాధికారులను కలిసినట్టు తెలిపారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని తన సోదరి రేణుక వివాహం కోసం దాచుకున్న నగలు ఆభరణాలు నగదును దొంగతనం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ ఇంట్లో వివాహం ఆగిపోయిందని దయచేసి తమకు న్యాయం చేసి తమ బంగారం నగదు ఇప్పించాలని బాధితులు కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు..