శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం…!!!

శంషాబాద్ పీఎస్ పరిధిలో దారుణం…!!!

హైదరాబాద్ :

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.

ఓ యువకుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చడంతో యువకుడు గుట్టు చప్పుడు కాకుండా గర్భస్రావం చేయించాడు. ఈ విషయం బయటకి పొక్కడంతో బాలిక తల్లిదండ్రులతో రాజీ ప్రయత్నం చేశాడు. బాలిక శీలానికి వెలకట్టాడు. బాలిక కుటుంబ సభ్యులు డబ్బుకు లొంగ కుండా పోలీసులను ఆశ్రయించారు. నిందితుడుపై శంషాబాద్ పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బాధిత బాలిక తన తండ్రితో పాటు నిందితుడి వ్యవసాయ క్షేత్రంలోకి పనికి వెళుతుండేది. బాలికపై కన్నేసిన నిందితుడు ఆమెను బెదిరించి.. భయపెట్టి లొంగదీసుకుని పలుమార్లు హత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో ఆమె శరీరంలో మార్పులు రావడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో జరిగిన ఘోరం తండ్రికి చెప్పింది. బాలిక ప్రాణానికి ముప్పు అని తెలిసి కూడా నిందితుడు ఐదో నెలలో గర్భస్రావం చేయించాడు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరోవైపు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పక్కపక్క ఇళ్లల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది.