జగిత్యాల జిల్లా…
కిడ్నాప్ కు గురైన 2 సంవత్సరాల బాలుడి కేసును16 గంటల్లో చేదించిన జిల్లా పోలీసులు
కిడ్నాపర్ అరెస్ట్
వివరాలు వెల్లడించిన జిల్లా SP అశోక్ కుమార్ IPS గారు
నిన్న సాయంత్రం మెట్ పల్లి పట్టణం లో ని దుబ్బావాడ లో సాయంత్రం 6:30 గంటల కు 2 సంవత్సారాల వయస్సు గల అబ్బయి, తన అక్క వయస్సు:7 సం,, తో పాటు ఉండగా పల్సర్ బైక్ పై ఒక గుర్తు తెలియని వ్యక్తి, మొఖానికి మస్కు ధరించి వచ్చి బాలుడి అక్కకు రూ.20 ఇచ్చి ఎదైన కొనుక్కొని తినుమని పంపి, అట్టి బాలుడిని బైక్ పై ఎక్కించికొని అక్కడి నుంచి పారిపొగా, అట్టి బాలుని అక్క తన తమ్ముని వద్దకు రాగ తన తమ్ముడుని బైక్ పై ఎక్కించుకొని పారిపోవడం చుసి వెంటనే తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి జరిగిన విషయం చెప్పడం జరిగింది. Dial-100 ద్వార అట్టి బాలుని తల్లిదండ్రులు మేట్ పల్లి పొలిస్ స్టేషన్ కు సమచారం ఇచ్చి, సంఘటన గురించి పిర్యధు చేయగా, పొలిస్ వారు కేసు నమొధు చేయటం జరిగింది.
వెంటనే జిల్లా ఎస్పి శ్రీ అశొక్ కుమర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేట్ పల్లి DSP అయిన ఉమ మహేశ్వర్ గారి పర్యవేక్షణ లో మెట్పల్లి CI నిరంజన్ రెడ్డి, కొరుట్ల CI B.సురెష్ మరియు CCS CI లక్ష్మి నారయణ, మెట్పల్లి ఇబ్రహింపట్నం, మల్లపూర్ లకు చెందిన చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్, రాజు SI లు మరియు స్పెషల్ పార్టి సిబ్బంది లను 6 బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ అయిన బాలును గురించి మరియు నిందితుని గురించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు మద్యహ్నం 2 గంటల సమయం లో వెంకట్రావు పెట్ శివారు లో ఒక వ్యక్తి బైక్ పై బాలున్ని తీసుకవెల్లుతుండగా, పొలిస్ వారు అతనిని పట్టుకొని బాలుడిని సురక్షితంగా తీసుకొనిరావడం జరిగింది.
16 గంటలలో కిడ్నప్ కేసును ఛేదించిన పొలిస్ సిబ్బందిని జిల్లా ఎస్పి శ్రీ అశొక్ కుమర్ ఐపీఎస్ గారు అభినందించారు.
ఇట్టి సమవేశం లో మేట్పల్లి DSP అయిన ఉమ మహేశ్వర్, మెట్పల్లి CI నిరంజన్ రెడ్డి, కొరుట్ల CI B.సురెష్ మరియు CCS CI లక్ష్మి నారయణ, మెట్పల్లి ఇబ్రహింపట్నం, మల్లపూర్ లకు చెందిన చిరంజీవి, అనిల్, కిరణ్ కుమార్, రాజు SI లు మరియు స్పెషల్ పార్టి సిబ్బంది పాల్గొన్నారు