CM సిద్దరామయ్య విదేయులకు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం…!

CM సిద్దరామయ్య విదేయులకు ఉద్వాసన పలకాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం…!

త్వరలో మంత్రి వర్గ విస్తరణలో 5మంత్రులను తొలగించి 6మంది కొత్త వారితో మంత్రివర్గం భర్తీ చేసే అవకాశం..

ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆప్తుడిగా ముద్ర పడిన నగరాభివృద్ధిశాఖ మంత్రి బైరతి సురేశ్‌, ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఎంసీ సుధాకర్‌, అబ్కారి మంత్రి ఆర్‌బీ తిమ్మాపుర, సహకారశాఖ మంత్రి రాజణ్ణ, ప్రజా పాలన, హజ్‌శాఖ మంత్రి రహీంఖాన్‌ను తొలగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే నాగేంద్ర రాజీనామాతో ఒక స్థానం ఖాళీగా ఉంది. వీటితో కలిపి ఆరు స్థానాలు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భద్రావతి ఎమ్మెల్యే సంగమేశ్‌కు కేబినెట్‌లో చోటు ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.