రుణమాఫీ అమలుపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

రుణమాఫీ అమలుపై తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి , మాజీ కార్పోరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ తదితరులు..

దిల్ సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతున్నాయి ఎంత నిజమో.. తెలంగాణలో భాక్రానంగల్ డ్యామ్ ఎంత నిజమో తెలంగాణలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ అంతే నిజం..

అభినవ గోబెల్స్ అవార్డు ఇస్తే అది రేవంత్ సర్కారుకు దక్కుతుంది..

ఎన్నికల సమయంలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని పదే పదే చెప్పారు..

బడాయిల బచ్చిగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు అన్నట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, చేస్తున్న పనులకు తెలంగాణ ప్రజలు చెప్పుకునే ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి..

డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రచారంలో చెప్పాడు..

జనవరి 6న ఓ మీడియా ఛానల్ తో ఒకటి, రెండు నెలలలో రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డే ప్రకటించాడు..

మూడు విడతలలో రూ.31 వేల కోట్లు ఆగస్ట్ లోపలే పూర్తి చేస్తానని జులై 18న హామీ ఇచ్చాడు..

జులై 28న అమెరికా వెళ్తూ రాగానే రుణమాఫీ చేస్తానని రేవంతే ప్రకటించాడు..

కానీ ఆగస్ట్ 15న రూ.17,869 వేల కోట్లు రుణమాఫీ చేశామని చెప్పుకున్నాడు..

ఆగస్ట్ 15 నాటికి అందరి రైతుల రుణాలు మాఫీ అవుతాయని రేవంత్ ప్రకటించాడు..

మరి రూ.31 వేల కోట్లకు కేవలం 17 వేల కోట్లతో రుణమాఫీ ఎలా పూర్తవుతుంది..

ఆరు గ్యారంటీలలో ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదు..

ఆరు గ్యారంటీలు గడువులోగా అమలు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారు..

ఆ విషయాన్ని రుణమాఫీ చుట్టూ తిప్పి అరకొరగా అమలుచేసి రుణమాఫీ అయిపోయిందని దబాయిస్తూ రాజీనామా చేయాలని దుర్భాషలాడడం సరికాదు..

రాష్ట్రంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత హరీష్ రావు..

ఏ బ్యాంకులో రైతుల రుణాలు మాఫీ అయ్యాయో సర్కారు చెబుతుందా ? రుణమాఫీ అయిపోతే రాష్ట్రంలో రైతులు ఎందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు..

రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులు ఉండగా 60 లక్షల మంది రుణాలు తీసుకున్నారు.. ప్రభుత్వం 44 లక్షల మంది అని లెక్కలు చెబుతున్నది.. మరి ప్రభుత్వం ఎందుకు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ ఎందుకు చేసింది ?..

అసలుకంటే కొసరు ఎక్కువ అన్నట్లు రుణమాఫీపై మీడియా ప్రకటనలకే రూ.300 కోట్లు వరకు ఖర్చు చేశారు..

బీఆర్ఎస్ పాలనలో రూ.29 వేల కోట్లు రుణమాఫీ, రూ.72 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతులకు అందజేసి అండగా నిలిచాం..

కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రైతుభరోసా విడత కింద ఒక్కసారికి రూ.15 వేల కోట్లు అవసరం అవుతుంది.. రైతుభరోసా ఎగ్గొట్టి రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను మోసం చేసింది..

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, ఉపాధి హామీ కూలీలను వెన్నుపోటు పొడిచింది .. ఆసరా ఫించను దారులను వెన్నుపోటు పొడిచింది .. నిరుద్యోగులను వాడుకుని ఓట్లేయించుకుని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచింది..

గ్రామ పంచాయతీలతో పారిశుద్ద కార్మికులకు, పాఠశాలలో వంట కార్మికులకు వేతనాలు రాక గ్రామాలలో తండ్లాడుతున్నారు..

మహాలక్ష్మి పథకం కింద రూ.2500 అని చెప్పి ఆ పథకం గురించి మాట్లాడడం లేదు..

మాట మీద నిలబడిన హరీష్ రావును రాజీనామా చేయమనడం హస్యాస్పదం..

పార్లమెంటులో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో చాలా విషయాలలో చక్కగా వ్యవహరిస్తున్నాడు.. మరి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఎదుటి వ్యక్తులను అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు.. తూలనాడుతున్నాడు..

రాహుల్ గాంధీ మాట్లాడే హిందీ, ఇంగ్లీష్ భాషలు చాల చక్కగా ఉంటాయి .. అవి రేవంత్ కు అర్ధంకానట్లుంది.. అందుకే అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు..

కేంద్రంలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే అధికార పక్షం నెహ్రూ, ఇందిరల గురించి మాట్లాడుతారు..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత పదేళ్లలో వందేళ్ల విధ్వంసం అని అడ్డగోలు వాదనకు దిగుతారు..

ప్రపంచబ్యాంకుతో మాట్లాడిన సీఎంకు తెలంగాణలో ఉన్న బ్యాంకు అధికారులతో మాట్లాడి ఏ రైతుకు రుణమాఫీ జరిగిందో చెప్పడానికి సమయం లేదా ?..

రైతుభరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ, చర్చలు, శాసనసభలో చర్చలన్నీ పక్కకు పోయాయి ..జులై 15కు నివేదిక అన్నారు .. ఆగస్ట్ 15 వచ్చినా గతి లేదు..

కనీసం క్రిష్ణానదిలో పోతున్న నీటిని వడిసిపట్టుకునే ఆలోచన ప్రభుత్వానికి లేదు..

పాలమూరు జిల్లాలో కుంటలు, చెరువులు వెలవెలబోతున్నాయి.. కట్టిన రిజర్వాయర్లను నింపుకునే సోయి ప్రభుత్వానికి లేదు..

గత ఎనిమిది నెలలలో తట్టెడు మట్టి తియ్యకుండా పనులు పక్కన పెట్టారు..

పాలమూరు రంగారెడ్డి పథకంలో మూడు రిజర్వాయర్లలో 28 టీఎంసీల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా గాలికి వదిలేశారు..

రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు.. గత ప్రభుత్వంలోనే సిద్దం చేసిన పంపును కూడా వాడుకునే ఉద్దేశం లేదు..

ప్రభుత్వాలు మారినా ప్రజలు మన వాళ్లు అన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు.. కేసీఆర్ సిద్దం చేసిన ప్రాజెక్టులను వాడుకోవడం పట్ల అశ్రద్ద చేస్తున్నారు..

రైతుల మంచితనం, అమాయకత్వం కాంగ్రెస్ పార్టీకి ఒక మూల పెట్టుబడిగా మారింది.. ఆశపడ్డ రైతులను అమాంతం వంచించారు..

రాష్ట్రంలో రైతుల పరిస్థితి ధీనంగా ఉంది.. ప్రజల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తుంది..

పాలమూరు నుండి ముఖ్యమంత్రి అయినందుకు రోశం ఉంటే, సిపాయి అయితే కేసీఆర్ కన్నా వేగంగా పనులు చేసి చూయిస్తాను అని సవాల్ విసిరి పనులు చేసి చూయించాలి..

బీఆర్ఎస్ పాలనలో ఒక స్థాయికి వచ్చిన తెలంగాణ వ్యవసాయం కాంగ్రెస్ పాలనలో ఆగం అయింది..

రుణమాఫీ అయిన 22 లక్షల మంది రైతులను కదిలించినా రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేశాడు.. కరెంటు లేదు, నీళ్లు లేవు అనే చెబుతారు..

ఇతరులను చిన్నబుచ్చి మాట్లాడినంత మాత్రాన గొప్పోళ్లు కాలేరు .. వాళ్లకన్నా గొప్ప పనులు చేస్తే గొప్పవాళ్లు అవుతారు..

ఈ శతాబ్దానికి సరిపడినంత మోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగానికి చేసింది..

రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ కు ఇప్పటి వరకు 1,11,027 వాట్సాప్ ఫిర్యాదులు వచ్చాయి..

బీఆర్ఎస్ కాల్ సెంటర్ కు వచ్చిన ఫిర్యాదులను సీఎం కార్యాలయానికి పంపిస్తాం….