రేవంత్ రెడ్డి పైన KTR సంచలన కామెంట్స్

రేవంత్ రెడ్డి పైన KTR సంచలన కామెంట్స్

KTR చిట్ చాట్ కీలకమైన పాయింట్స్

ప్రధానమంత్రి మోడీ అంటే ఎందుకు భయమో దానికి అసలు కారణాన్ని రేవంత్ రెడ్డి ఈ మధ్యనే తన సన్నిహితులు వద్ద బయట పెట్టుకున్నారు

రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీనే

త్వరలోనే రేవంత్ రెడ్డి బీజేపీలో తన బృందంతో చేరడం ఖాయం

నేను పుట్టింది బీజేపీలోనే.. చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్రస్థానం ముగుస్తుందని ప్రధానమంత్రికి, అమిత్ షా లకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

నేను కాషాయ జెండాతోనే ఏబీవీపీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాను… అదే జెండా కప్పుకొని చనిపోతానని మోడీతో చెప్పింది? వాస్తవమా కాదా రేవంత్ చెప్పాలి?

ఈ అంశంలో రేవంత్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి.

రుణమాఫీ వైఫల్యంపైన గ్రామాలకు భారత రాష్ట్ర సమితి

సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసం పైన దాడి చేసిన వారి పై ప్రభుత్వం కేసు పెట్టాలి

ముఖ్యమంత్రి సొంత మీడియా ప్రతినిధులు కమలాసన్ రెడ్డి లాంటి సీనియర్ అధికారి పైన దాడి చేసినంత పని చేశారు

ఒకవైపు ముఖ్యమంత్రి అధికారిక మీడియానేమో ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల పైన దాడి చేస్తుంది

మరోవైపు ముఖ్యమంత్రి, ప్రభుత్వమేమో… ప్రభుత్వ ఆస్తులపైన దాడి చేస్తుంది.

47 లక్షల మందికి రుణమాఫీ కావాలని ఎస్ఎల్బీసీ చెప్పింది

రుణ మాఫీ కోసం రూ. 40 వేల కోట్లు అవసరమవుతుందని రేవంత్ రెడ్డి చెప్పారు.

31వేల కోట్లు అంటూ కేబినెట్ ఆమోదించింది

26 వేల కోట్లంటూ బడ్జెట్ ఆమోదించింది.

చివరికి 17,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ అన్నారు

కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారు.

రాష్ట్రంలో రుణమాఫీ అంతా డొల్ల.

గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరిస్తాం

సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు…ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తాం

రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలు పెడతాం.

ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తాం

ప్రతి మంత్రి నియోజక వర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తాం.

అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతాం.

మా కాల్ సెంటర్ కి దాదాపు లక్షా 20 వేల ఫిర్యాదులు వచ్చాయి.

ఒక ప్రొఫార్మ తయారుచేసి దాని ఆధారంగా సమాచారాన్ని సేకరిస్తాం

మొత్తం నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే గాని సీనియర్ నాయకులు కానీ బాధ్యత తీసుకుంటారు

గ్రామంలోని ప్రతి ఇంటికి మా పార్టీ శ్రేణులు వెళ్లి ఈ సమాచారాన్ని నేరుగా సేకరిస్తాయి

కనీసం 40% మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు

రైతులు అంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు

రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాని నుంచి దృష్టి మళ్లించేలా అటెన్షన్ డైవర్షన్ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తోంది.

ఒకవైపు ముఖ్యమంత్రి వంద శాతం రుణమాఫీ పూర్తి అయిందని చెబుతుంటే… ప్రభుత్వము రుణమాఫీ కానీ వాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు పెట్టడం వారి డొల్ల వైఖరికి నిదర్శనం

ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపైన దాడులు చేయించడం దేనికి నిదర్శనం

కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫాక్స్ కాన్ సంస్థ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది

రేవంత్ రెడ్డి మాటలు, పరిపాలన వైఫల్యం కారణంగా ఫాక్స్ కాన్ ఏమైనా వెనక్కి వెళ్ళిపోయిందా?

40,000 తోని చైనా తర్వాతఅతిపెద్ద రెండో క్యాంపస్ ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని సంస్థ చెప్పటం దేనికి నిదర్శనం

ఫాక్స్ కాన్ పెట్టుబడుల పైన, విస్తరణ పైన ప్రభుత్వం నిజనిజాలను బయటపెట్టాలి

తదుపరి విస్తరణను ఫాక్స్ కాన్ సంస్థ చేస్తుందా లేదా అనేది ముఖ్యమంత్రి చెప్పాలి

ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడిన మాటలు, చేస్తున్న దుష్ప్రచారం కారణంగానే ఫాక్స్ కాన్ కంపెనీ బెంగళూరుకి పోయిందా అని అనిపిస్తుంది

24వ తేదీన మహిళా కమిషన్ ముందు హాజరవుతాను.

గత ఎనిమిది నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన దురాగతలను అందజేస్తాను