శ్రావణ మాసంలో కొండ దిగిన కోడి
హైదరాబాద్ :
మాంసం ప్రియులకు గుడ్‌న్యూస్.. గత కొన్ని నెలలుగా కొండెక్కి కూర్చు న్న చికెన్ ధరలు దిగొచ్చా యి. గత నెలలో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.300 వరకు పలికిన సంగతి తెలిసిందే. దీంతో చికెన్ రేట్లు చూసి సామాన్యుడు తినలేక గుటకలు మింగి సరిపెట్టుకున్నాడు.
శుభకార్యాలు, పంక్షన్లకు కూడా అత్యవసరం అయితే తప్ప చికెన్ కొనలేని పరిస్థితి. ఇలా ఈ ఏడాది ప్రారంభం నుంచి చికెన్ రేట్లు చుక్కలు చూపిస్తూనే వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ నెల మొదటి వారం నుంచి చికెన్ ధరలు రోజురోజుకు పతన మవుతూ వచ్చాయి. అందు కు కారణం లేకపోలేదు. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో ఈ నెలంతా పూజలు, వ్రతాలు ఇతర కార్యక్రమాలతో మహిళలు యమ బిజీగా ఉంటారు.
దీంతో మహిళలు మాంసా హారాన్ని ఇంట్లోకి రానివ్వరు. మగవారు నేరుగా చికెన్ కొని ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితి. ఏదో రెస్టారెంట్‌కి వెళ్లి తినాల్సిందే. దీంతో చికెన్ వినియోగం తగ్గి ధరలు కూడా పడి పోయాయి. మరోవైపు పూజలు, వ్రతాలతో సంబంధం లేని మరి కొందరు మాంసం ప్రియులు ఇదే అదనుగా చికెన్ లాగించేస్తున్నారు.
ఆగస్టు 5న కిలో రూ.180 ఉన్న చికెన్ ధర.. ఆగస్టు 11వ తేదీ ఆదివారం నాటికి రూ.150కి పడిపోయింది. ఆగస్టు 17వ తేదీ శనివారం రూ.158గా ఉంది. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో ఆదివారాలతో సహా అన్ని రోజుల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
సాధారణంగా ఆదివారాల్లో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీంతో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా.. ఆదివారం రాగానే చికెన్ రేట్లు అమాంతం పైకి ఎగబా కుతాయి. కానీ శ్రావణ మాసం కావడంతో అసలు కొనేవారే కరువయ్యారు.
దీనిపై చికెన్ సెంటర్ యజమానులు మాట్లాడు తూ.. త్వరలోనే మళ్లీ చికెన్ ధరలు పుంజు కుంటాయని చెబుతున్నారు.ప్రస్తుతం శ్రావణమాసం కావడం, ఇతర పూజలు ఉన్నందున చికెన్ ధర రూ.150కి తగ్గిందని చెబుతున్నారు.
గత నెలలో రూ.280 వరకు ఉందని అన్నారు. ఈ నెల లో వివాహాలు, శుభాకార్యా లు కూడా ఉన్నందున చికెన్ ధర పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.