గులాంనబీ ఆజాద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ…!!!
జమ్మూ కాశ్మీర్ లో దశాబ్దకాలం తరువాత కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికలు జరుగనున్నాయి.జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అంచనాలకు మించి సత్తా చాటింది.
ఈ పట్టును నిలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా పార్టీ రాజీనామా చేసి వెళ్లిన గులాం నబీ ఆజాద్‌ను మళ్లీ రప్పించుకునే ప్రయత్నాల్లో పడింది. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమి గనక అధికారంలోకి వస్తే నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం.
ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం.. ఆజాద్‌తో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. ఆయన పెట్టే షరతులకు అంగీకరించితే- ఆజాద్ చేరిక లాంఛనప్రాయమే కావొచ్చు.
డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించారు. దీన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి.
బీజేపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని…