కవితకు మళ్ళీ షాక్… బెయిల్ విషయంలో పదేపదే నిరాశ…
న్యూఢిల్లీ :
ఢిల్లీ లిక్కర్ సీబీఐ,ఈడి కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది.
కవిత కేసులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హై కోర్ట్ తీర్పును కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆమె బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఉదయం నుంచే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళైనా కవితకు బెయిల్ లభిస్తుందని.. ఆమె కుటుంబంతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. కానీ కవితకు మరోసారి షాక్ తగిలింది. అయితే నేడు సుప్రీం బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది. వచ్చే మంగళవారం అంటే ఆగస్టు 27 కి వాయిదా వేసింది. శుక్రవారం నాటి కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశాలు జారీ చేసింది.
గురువారం వరకు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రింకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం లోపు కవిత తరఫున న్యాయవాది రిజాయిండర్ దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కవిత కేసును జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరిగింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో గత ఐదు నెలలుగా కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించడం జరిగింది. లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. లిక్కర్ కేసులో కవితకు ట్రయల్ కోర్టు,హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు.
లిక్కర్ పాలసీ ఈడీ కేసులో మార్చి 15న, సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవిత అరెస్ట్ అయ్యారు. కవిత బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 12న దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు నోటిసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ, సీబీఐ తనపై నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆమె ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ మద్యం కేసులో కవితకు పదే పదే నిరాశే ఎదురవుతోంది. ఇవాళ కూడా తిరిగి నిరాశే ఎదురైంది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని గత విచారణలో భాగంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తనకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(క్రిమినల్) దాఖలు చేశారు.