ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి… కట్ చేస్తే, భర్త కువైట్‌లో… భార్య అత్తగారింట్లో..చివరికి ఏమైంది అంటే…?

ఫేస్‌బుక్ పరిచయంతో పెళ్లి… కట్ చేస్తే, భర్త కువైట్‌లో… భార్య అత్తగారింట్లో..చివరికి ఏమైంది అంటే…?

ఫెస్‌బుక్ పరిచయం.. పెళ్లిదాకా తీసుకెళ్ళింది.. కానీ.. భర్త, అతని కుటుంబసభ్యుల తీరుతో ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ముగిసింది..

భర్త గల్ఫ్ కంట్రీలో ఉండటం.. ఆమె అత్తగారింట్లో ఉండటం.. కట్ చేస్తే పెళ్లైన ఏడాదిన్నరకే.. ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పలు ప్రశ్నలకు తావిస్తోంది..

ఈ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా పీలేరులో చోటుచేసుకుంది..

పీలేరుకు చెందిన ఒక యువతి ఫేస్బుక్ ప్రేమాయణం, పెళ్లి విషాదంగా ముగిసింది.

అత్తారింట్లో జరుగుతున్న గొడవలు, వేధింపుల విషయంపై అర్షియ మాట్లాడేందుకు రెండ్రోజుల క్రితం పీలేరులోనీ పుట్టింటికి వచ్చింది.. ఆ తర్వాత తిరిగి సాయంత్రమే వాల్మీకిపురంలోని అత్తవారింటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన గంటలోపే ఆర్షియ సెల్‌ఫోన్ ఆఫ్ అయింది.. ఈలోపే అర్షియ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం పీలేరులో ఉన్న తల్లిదండ్రులకు అందింది. ఉరి వేసుకుని మృతి చెందిందని.. వాల్మీకిపురం ప్రభుత్వాస్పత్రిలో డెడ్ బాడీ ఉందని చెప్పడంతో అర్షియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.

ఉదయం ఇంటికి వచ్చి కష్టాలు, బాధలు చెప్పుకున్న కూతురు సాయంత్రానికి శవంగా మారడంపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఆర్షియను అత్తారింటి వారే హతమార్చారని, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్షియ తల్లిదండ్రులు. భర్త వసీం, అత్తామామలే అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు.

ఆర్షియ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.. ఇంటిని పరిశీలించిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అర్షియా అత్తామామలను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఫేస్బుక్ పరిచయం పెళ్లి వరకు వెళ్లినా.. వసీం అక్రమ్.. అతని కుటుంబసభ్యుల తీరుతో అర్షియా జీవితం ఇలా ఏడాదిన్నరలోపే అర్ధాంతరంగా ముగిసి పోయిందని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు.