వెైద్యానికి వచ్చిన మహిళలు, చిన్నారుల నగ్న చిత్రాల చిత్రీకరణ
అమెరికాలో భారత వైద్యుడి అరెస్టు
తాను పనిచేసే ప్రదేశంలో రహస్య కెమెరాలతో మహిళలు, చిన్నారుల నగ్న చిత్రాలు రికార్డు చేసిన ఓ భారతీయ వైద్యుడిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి భార్య ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి ఇంటిలో వివిధ స్టోరేజ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో వేలాదిగా వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పవిత్రమైన వృత్తిలో ఉన్న అతను నీచమైన పనికి పూనుకున్నాడు. తన దగ్గరకు వైద్యానికి వచ్చిన మహిళలు, చిన్నారులను స్పృహ లేని సమయం చూసి అభ్యంతరకర దృశ్యాలను రికార్డు చేసేవాడు.గత కొన్నేళ్లుగా తాను పనిచేస్తున్న ఆసుపత్రుల్లో రహస్య కెమెరాలతో వీడియోలను చిత్రీకరించాడు. ఎట్టకేలకు భార్య ఫిర్యాదుతో అతడి అరాచకాలు వెలుగులోకి రావడంతో ఇటీవల ఆక్లాండ్ కౌంటీ పోలీసులు అరెస్టు చేశారు.వివరాల్లోకెల్తే.. భారత్‌కు చెందిన ఒయిమెయిర్ ఎజాజ్ 2011లో వర్క్ వీసాపై అమెరికాకు వెళ్లాడు. తొలుత కొన్నేళ్ల పాటు అలబామాలో నివాసమున్న అతడు 2018లో మిషిగాన్‌కు మకాం మార్చాడు. ఓ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని పలు ఆసుపత్రుల్లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నాడ