కవితతో ములాఖత్ కానున్న కేటీఆర్, హరీష్
న్యూఢిల్లీ / హైదరాబాద్ :
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి గత కొన్ని నెలలుగా తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ప్రతీసారి కవితకు నిరాశానే ఎదురవుతోంది. మరోవైపు జైలులో ఉన్న కవిత బరువు తగ్గారని వార్తలు వినిపించాయి. అయితే నిన్న కవిత జైలులో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను జైలు అధికారులు ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
ఆరోగ్యం నిలకడ అయిన తర్వాత తిరిగి కవితను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. జైలులో కవిత అనారోగ్యం బారిన పడటం ఇదిరెండో సారి. కాగా.. జైలులో ఉన్న కవితతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు ఈరోజు ములాఖత్ కానున్నారు. కవిత అనారోగ్యం గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రులు కవితను కలిసేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
కాగా.. నిన్న జైలులో అస్వస్థతకు గురైన కవితకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత గైనిక్ సమస్యలు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
జైలు డాక్టర్ల సిఫారసు మేరకు వైద్య పరీక్షల నిమిత్తం కవితను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలింది