తస్మాత్ జాగ్రత్త బ్రో… పాత సెల్ ఫోన్లను తెలియని వాళ్ళకి అమ్మితే ఇక అంతే…
ఆ ఫోన్ తో వారు ఏదైన సైబర్ నేరానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయి…రిస్క్ లో పడే అవకాశాలు ఉన్నాయి..అని హెచ్చరిస్తున్న పోలీసులు
అపరిచిత వ్యక్తులకు పాత సెల్ ఫోన్స్ అమ్మ వద్దని పోలీసులు సూచిస్తున్నారు.
మనం కొత్త ఫోన్ కొనుగోలు చేసినపుడు దాని ఐఎంఈఐ నంబర్ కూడా మన పేరు మీదనే రిజిస్టర్ అవుతుంది.
అయితే ఆ ఫోన్ పాత పడిందని ఎవరికైనా విక్రయిస్తే..
వారు ఆ ఫోన్ ద్వారా సైబర్ నేరానికి పాల్పడితే దర్యాప్తు సంస్థలు ముందుగా ఆ ఫోన్ ని అధికారికంగా కొన్న వారినే విచారిస్తాయి.
ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న బిహార్ ముఠాను ఇటీవల రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు.