అక్రమ కట్టడాల కూల్చివేత పై స్పందించిన సినీ హీరో అక్కినేని నాగార్జున
హైదరాబాద్ :
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున స్పందించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కోర్టు స్టే ఇచ్చిన అంశంపై ప్రభుత్వం, హైడ్రా నిర్ణయం తీసుకుని కూల్చి వేతలు చేపట్టడం బాధాకరం అని అన్నారు.
ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను అడ్డుకుంటూ గతంలోనే కోర్టు నుండి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టు కేసులకు విరుద్ధంగా N కన్వెన్షన్ సెంటర్‌ని కూల్చి వేయడం బాధాకరం.
మా పరువు ప్రతిష్టలు కాపాడుకోవడం కోసం, కొన్ని వాస్తవాలను అందరి ముందు బయటపెట్టడం అవసరం అనిపించి ఈ ప్రకటన చేస్తున్నాను. అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి మేము ఎటు వంటి కబ్జాలు చేపట్టలేదని అందరికి చెప్పాలని భావించాను అంటూ అక్కినేని నాగార్జున ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం హైడ్రా కూల్చి వేతలు చేపట్టిన భూమి పట్టా భూమి. అందులో ఒక్క అంగుళం కూడా ట్యాంక్ ప్లాన్ ఆక్రమణకు గురవలేదు. N కన్వెన్షన్ సెంటర్ పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం. కూల్చివేయాల్సిందిగా గతంలో ప్రభుత్వం ఇచ్చిన అక్రమ నోటీసులపై కోర్టు స్టే కూడా ఇచ్చింది అని నాగార్జున పేర్కొన్నారు
స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది అని ఆరోపించారు.