హైడ్రాకు ఫుల్ పవర్ తగ్గేదేలే
హైదరాబాద్ :
నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్‌సాగర్‌తోపాటు… దశాబ్దాలుగా హైదరాబాదీల దాహర్తిని తీర్చిన జంట సాగరాలను వేలాది చెరువులను తవ్వించారు. ఈ సరస్సులను సంరక్షించి వారసత్వ సంపదగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యతను విస్మరిస్తూ చెరువులను చెరబడుతుం డటమే నేటి దౌర్భాగ్యం…!
అందుకే ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది… నగరం లోని సరస్సులకు పూర్వవై భవం తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
హైదరాబాద్ కోటిన్నర జనాభాను కడుపులో పెట్టుకున్న విశ్వనగరం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం కుటుంబాలకు ఆసరా మన హైదరాబాద్. తెలుగు రాష్ట్రాలే కాదు దేశం నలుమూలల నుంచి ఇక్కడి వచ్చి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటున్న వారు లక్షల్లోనే ఉన్నారు.
ఈ నగరం ఇలా విశ్వనగరంగా వర్ధిల్లాలని ఐదు శతాబ్దా ల క్రితమే మన పూర్వీకులు దీవించారు. అందమైన నగరం నిర్మించాలని నగరం నలుమూలలా సరస్సులను తవ్వించారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయల సంపాదన హైదరాబాద్ ఎంత బాగుం టే మనం అంత బాగుంటాం అనేది మన పూర్వీకుల ఆలోచన..
కానీ, ప్రస్తుతం ఇక్కడున్న వారికి హైదరాబాద్ చరిత్రతో పనిలేదన్నట్లే వ్యవహరి స్తున్నారు. అందమైన హైదరాబాద్.. ఆరోగ్య హైదరాబాద్.. ప్రశాంత హైదరాబాద్ కోరుకుంటూనే ఎవరికి తోచిన విధంగా వారు విధ్వంసం సృష్టిస్తున్నారు.
సువిశాల రోడ్ల కోసం, అత్యాధునిక వసతుల కోసం నగరం నడిబొడ్డున ఉన్న చెరువులు, నాలాలను కప్పేస్తున్నారు. కబ్జాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పైసలు వస్తున్నాయని సంబరమే కానీ, భవిష్యత్ తరాలను నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరూ ఆలోచించడం లేదు. ఇలాంటి వారి అత్యాశ ఫలితమే..
చిన్న వర్షం కురిసినా నగరంలో వరద పోటెత్తుతోంది… ఈ సమస్య పరిష్కా రంతోపాటు భవిష్యత్ తరా లకు భద్రత కల్పించేందుకు ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది.
హైదరాబాద్ సిటీ పెరుగు తున్న కొద్దీ సమస్యలు రెట్టింపు అవుతున్నాయి. ఓ వైపు అభివృద్ధి సూచికలు బలంగా కనిపిస్తున్నాయని ఆనందపడేల చేసిన తప్పులూ వెంటాడుతున్నాయని చింతించాలో తెలియని దుస్థితి.
ఐదేళ్లు.. పదేళ్లుగా చేసిన తప్పులు కాదు.. మూడు, నాలుగు దశాబ్దాలుగా చేస్తున్న తప్పులు ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతున్నారు.
ఆ తప్పులు సరిదిద్దడం అంత తేలిక కాదు. కానీ, ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయమే తీసుకుంది. చెరువులను చెరబట్టిన వారి భరతం పడుతూ హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది.