మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్…

కరీంనగర్ జిల్లా :

మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కామెంట్స్…

నిన్న బిఆర్ఎస్ పై కాంగ్రెస్ మంత్రులు బట్టి విక్రమార్క, శ్రీదర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలు దురదృష్ట కరం..!

కెసిఆర్ గారు ప్రజల్లో వస్తారట ఏ ముఖం పెట్టుకొని వస్తారు అని మల్లు భట్టి విక్రమార్క గారు మాట్లాడారు..!

దీనిని బిఆర్ఎస్ పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు..

కాంగ్రెసోళ్ల పని ఎట్లా ఉన్నదంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉంది..!

మేము చెప్పింది చెప్పినట్లే చేస్తాం అని మాట్లాడిండు మల్లు భట్టి విక్రమార్క గారు.. ప్రజలు ఇవన్నీ వింటున్నారా ఆలోచిస్తున్నారు. మీరు చెప్పిన మాటలు ప్రజలు మరచి పోయారనుకుంటున్నరా..!

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు…!

420 హమీలల్లో ఒకే ఒక రుణ మాఫీ చేశాం అన్నారు పూర్తి స్థాయిలో జరగలేదు..!

22 లక్షల పై చిలుకు రైతులకు రుణ మాఫీ చేసి, గొప్పలు చెప్పుకొంటున్నారు..!

ఏ గ్రామంలోనైన మీరు ఇచ్చిన రుణమాఫీ పూర్తి స్థాయి లో జరిగిందా..,? రుణమాఫీ రైతుల వివరాలు పత్రికల్లో పూర్తి స్థాయిలో సమాచారం వస్తోంది..!

మీరు చెప్పింది ప్రతి ఒక్క రైతు రుణమాఫీ డిసెంబర్ 9 తేదీన ఒకే సారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు, రైతు కూలీలు, కౌలు రైతులకు ఇస్తామన్నారు..!

22 లక్షల పై చిలుకు రైతులకు మాత్రమే రుణ మాఫీ చేసిండ్రు..!

కెసిఆర్ చెప్పినవి, చెప్పనివి ఎన్నో హామీలు నెరవేర్చాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు.!

తెలంగాణ రాక ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది కదా మీ పాలనలో వ్యవసాయం సాగిందా సాగు నీళ్లు ఉన్నాయా. ఆత్మహత్యలు, ఆకలి చావు, వలసలు లేవా అని ప్రశ్నించారు..

కెసిఆర్ పాలనలో నీళ్ళు వచ్చినై అంటే ప్రాజెక్టులు నిర్మాణం జరగలేదా..

కాళేశ్వరం ప్రాజెక్టును బదనం చేసిండ్రు.. కాని కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ కి జీవనాధారం అని రుజువైంది..

కాళేశ్వరం పంపులు ఆన్ చేయకపోతే రాష్ట్రంలో నలుమూలల నీళ్లు ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తుంది..

వ్యవస్థ నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని ఏ మొఖం పెట్టుకొని వస్తావు అంటారా.? అసలు మీ మొఖం పెట్టుకొని ప్రజల్లో తీరుగుర్తున్నారో కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పాలి..!

అసలు ఏ ఘనకార్యం చేసిండ్రని ప్రజల్లో తిరుగుతున్నారు..! చెప్పాలని ప్రశ్నించారు..

అసలు మీరు ఒక ఫ్రీ బస్ తప్ప మీరు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు..!

మా ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము..

ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన కెసిఆర్ ను ఏ మొఖం పెట్టుకొని వస్తావు అని అంటారా..

నిన్న మల్లు భట్టి విక్రమార్క పర్యటించింది సింగరేణి ప్రాంతమే కదా. మీ హయాం లో పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలు ఎవరు తీసుకొచ్చింది కెసిఆర్ కాదా..

పెద్దపల్లి సింగరేణి ప్రాంతానికి వెళ్లి కెసిఆర్ ఏం చేసిండ్రు అని మాట్లాడుతారా..! సింగరేణిలో కూడా అడగకుండా నే కార్మికులకు కేసిఆర్ న్యాయము చేశారు..

కాంగ్రెస్ పాలనలో గురుకుల పాఠశాలలో పిల్లలు పురుగుల అన్నం తింటున్నామని ఏడుస్తున్నారు..!

కెసిఆర్ పాలనలో రెసిడెన్షియల్ స్కూల్ ఎలా ఉండే ఇప్పుడు ఉన్నాయి.. ఈ రోజు వరకు గురుకుల పాఠశాలలో 37 మంది విద్యార్థులు మృతి చెందారు..!

ఇంకా సిగ్గులేకుండా కెసిఆర్ పై విమర్శలా.. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా…..?

ఆరు ఏడు ఏండ్లలో డెంగ్యూ జ్వరాలు ఎందుకు రాలేదు..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి..

చికెన్ గున్య, డెంగ్యూ జరాలు ఎందుకు వచ్చినాయ్ మీ పనికిరాని తనం వల్ల, మీ చాతగాని తనంవల్లనే..

వైద్యం మొత్తం పడకేసింది, పెన్షన్, తులం బంగారం, రైతు బరోసా ఏది…? ఆ పైసలే కదా రుణమాఫీ కి ఇచ్చిందన్నారు..!

ప్రపంచంలో ఎన్ని అబద్దాల ఆడినా ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం కాని ఎక్కడ చూడలేదన్నారు..!

మీరచ్చి ప్రజల్లో కెసిఆర్ ను విమర్శించే వాళ్ళా.. ప్రజల అవసరాలను గుర్తించి దానిని శాశ్వతమైన పరిష్కారం చూపింది కెసిఆర్

ఉద్యోగ రంగంలో కేటిఆర్ పాత్ర కీలకం 4 లక్షల కోట్ల , పెట్టుబడులు ఈ రాష్ట్రాని వచ్చాయని గుర్తు చేశారు..

మేము ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా 32 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఫోటోలు దిగారు..! ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఈ ప్రభుత్యం ఇవ్వలేదు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఏవి అని ప్రశ్నించారు..!

కాంగ్రెస్ నాయకులను గ్రామాలలో కొద్ది రోజులలో ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు..

మంత్రి బట్టి విక్రమార్క జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. ధరణి నీ దమ్ముంటే రద్దు చేయండి.