డిల్లీ CM కేజ్రీవాల్ కు బెయిల్

డిల్లీ CM కేజ్రీవాల్ కు బెయిల్

ఐదున్నర నెలల తర్వాత తీహార్ జైల్ నుంచి విడుదల

ఆప్ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎట్టకేలకు ఆయనకు బెయిల్ దక్కింది.

ఇద్దరు జడ్జిలతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ శుక్రవారం ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

దీంతో దాదాపు ఐదున్నర నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు.

కోర్టు షరతులు..

కోర్టు పలు షరతులను విధించింది. రూ.10 లక్షలు పూచీకత్తుతో పాటు ఇద్దరు సెక్యూరిటీ సంతకాలు చేయాలని స్పష్టం చేసింది.

ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలని తెలిపింది. సాక్ష్యాలను టాంపర్ చేయకూడదని షరతులు విధించింది.

లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి లేకుండా ముఖ్యమంత్రి కార్యాలయానికి లేదా ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లకూడదని కోర్టు నిబంధన విధించింది.

అంతేకాదు గవర్నర్ అనుమతి లేకుండా ప్రభుత్వ ఫైళ్లపై సంతకం కూడా చేయకూడదని షరతులు విధించింది.

ఇక ఈ కేసుపై ఎలాంటి ప్రకటనలు చేయకూడదని, సాక్షులతో మాట్లాడకూదని క్లారిటీ ఇచ్చింది.

ఐదున్నర నెలల తర్వాత విడుదల

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ అనంతరం జూన్ నెలలో ఆయనను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ కేసులో ఇప్పటికే ఆయన బెయిల్ పొందారు.

దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు. దాదాపు ఆరు నెలల జైలు శిక్ష ఆయన బయటకు రానుండడంతో ఆప్ నేతలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.