ప్రధాని మోదీ బర్త్ డే గిఫ్ట్ లు వేలం పాట
న్యూ ఢిల్లీ :.
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అందిన 600కు పైగా బహుమతుల వేలం మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. ఈ వేలం మహాత్మా గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 వరకు కొనసాగుతుంది.
పారాలింపిక్ పతక విజేత వస్తువులు, స్పోర్ట్స్ షూస్, రామమందిరం ప్రతిరూపం, వెండి వీణ వరకు, అవి వేలం వేయనున్నారు. వేలానికి పెట్టనున్న ఈ వస్తువుల మొత్తం బేస్ ధర రూ.1.5 కోట్లు ఉంటుందని సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సోమవారం తెలిపారు.
ధర రూ. 600 నుంచి రూ. 8.26 లక్షలు: ఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లో ప్రధాని అందుకున్న మెమెంటోలను ప్రదర్శించే ప్రదర్శనను షెకావత్ సందర్శించారు. అనంతరం విలేఖరుల
సమావేశంలో మాట్లాడు తూ…
ఈ బహుమతులను వేలం వేయడానికి ప్రభుత్వ కమి టీ బేస్ ధర నిర్ణయిస్తుం దని, వీటి ధరలు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.8.26 లక్షల వరకు ఉంటాయన్నారు.
సాంస్కృతిక మంత్రి మాట్లాడుతూ..మన ప్రధాని తనకు వచ్చిన బహుమ తులు, సావనీర్లను వేలం వేసే కొత్త సంస్కృతిని ప్రారంభించారు. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేసేవారని తెలిపారు.