కేరళను వణికిస్తున్న మంకీపాక్స్… నిఫా వైరస్లు.. ఒకే వ్యక్తిలో రెండు వైరస్లు గుర్తింపు… సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలెర్ట్
కేరళను వైరస్లు వణికిస్తున్నాయి. ఇప్పటికే మంకీ పాక్స్ కేరళను షేక్ చేస్తుండగా నిఫా వైరస్ మళ్లీ కలకలం సృష్టిస్తోంది. అంతేకాదు.. ఒకే వ్యక్తిలో అటు నిఫా.. ఇటు మంకీపాక్స్ లక్షణాలు బయట పడుతుండడం కేరళను మరింత కుదిపేస్తోంది. మంకీ పాక్స్.. నిఫా వైరస్ వ్యాప్తితో కేరళతోపాటు సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. తమిళనాడు- కేరళ బోర్డర్లో హైఅలెర్ట్ ప్రకటించి తనిఖీలు ముమ్మరం చేయడం కలకలం రేపుతోంది.
ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు కేరళ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన ఆయన మంకీపాక్స్ లక్షణాల తో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపింది. మంజేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని శాంపిల్స్‌ను కోజికోడ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. పాజిటివ్‌గా తేలింది. దాంతో.. దేశంలో రెండో మంకీపాక్స్ కేసు రికార్డ్ అయింది. అలెర్ట్ అయిన కేరళ అధికారులు.. దుబాయ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు. 16మందిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. ఈనెల 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది.