మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారితో మాట్లాడి భరోసా ఇచ్చిన… KTR

రాజేంద్రనగర్ పరిధిలోని మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ బాధితులను కలిసి, వారితో మాట్లాడి భరోసా ఇచ్చిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR & మాజీ మంత్రి, MLA సబితా ఇంద్రారెడ్డి.

KTR కామెంట్స్….

1920 నుంచి 2020 వరకు మనకు మూసీలో ఎలాంటి సమస్య రాలేదు.

2020 లో మాత్రమే ఒక్కటే సరి భారీగా వర్షం రావటంతో మూసీ లో ఇబ్బందులు తలెత్తాయి.

అప్పుడు కూడా కేసీఆర్ గారు ప్రజలకు ఇబ్బందులు పెట్టవద్దన్నారు.

కానీ కాంగ్రెసోళ్లే పర్మిషన్ ఇచ్చి, వాళ్లే రిజిస్ట్రేషన్ చేసి, వాళ్లే ఇళ్లను కూలగొడుతున్నారు.

ఈ ప్రభుత్వం లో కుడి చేయి ఏం చేస్తుందో…ఎడమ చేయికి తెలియటం లేదు.

రేవంత్ రెడ్డి ఒక అన్ ఫిట్, అసమర్థ సీఎం.

ఇక్కడ మార్కింగ్ ఇచ్చిన బిల్డింగ్ లకు సంబంధించి విలువ లెక్కిస్తే దాదాపు వెయ్యి కోట్ల వరకు ప్రజల ఆస్తి ఉంటుంది.

2400 కిలోమీటర్లు ఉన్న నమామీ గంగే ప్రాజెక్ట్ కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేశారు.

55 కిలోమీటర్ల మూసీ కి మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లంట.

మూసీని ప్రక్షాళన చేయమని నిన్ను ఎవరు అడిగారు.

వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఆరు గ్యారంటీలు అమలైనయా?

స్టాంప్ పేపర్లు, అఫిడవిట్లు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మరి హామీలు ఇచ్చారు.

ఢిల్లీ కాంగ్రెస్ కు రూ. 25 వేల కోట్లు పంపటానికే ఈ రూ. లక్షా 50 వేల కోట్లు ప్రాజెక్ట్ పెట్టుకున్నారు.

వాళ్ల బుల్డోజర్లకు అడ్డుగా మేముంటాం. ధైర్యం కోల్పోకండి.

ఇదే కాంగ్రెస్ పాలనలో గతంలో ఎప్పుడూ హైదరాబాద్ లో కర్ఫ్యూ ఉంటుండే.

కానీ కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క కర్ఫ్యూ లేకుండా బ్రహ్మండంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం.

హైదరాబాద్ లో లక్షల మంది వాళ్ల ఇళ్ల కోసం ఆందోళన చెందుతున్నారు.

హైదరాబాద్ లో ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించారని కక్ష పెట్టుకొని ఈ కుట్ర చేస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నహీ ఛలేగా అని రాహుల్ గాంధీ అంటాడు. మరి తెలంగాణలో వారి అయ్యా జాగీరా బుల్డోజర్ రాజ్ నడిపించేందుకు?

సోషల్ మీడియాలో ఆయనను తిడుతున్న తిట్లు చూస్తుంటే మనిషి అనేటోడు ఎప్పుడో సచ్చిపోతుండే.

నీ సొంత ఇళ్లు కూడా చెరువు, కుంటలోనే ఉంది. దాన్ని కూలగొట్టే దమ్ముందా నీకు.

దుర్గం చెరువులో వాళ్ల అన్న గానీ ఇళ్లు కూడా కూలగొట్టరంట.

వాళ్ల మంత్రులు, వాళ్ల ఎమ్మెల్యేలందరి ఇళ్లు హిమాయత్ సాగర్ చుట్టు ఉన్నాయి.

నీకు నిజాయితీ, చిత్తశుద్ది ఉంటే ముందు వాళ్ల ఇళ్లు కూలగొట్టు.

పేదలు, మధ్య తరగతి వాళ్లకు ఇళ్లు అనేది ఒక ఎమోషన్. అలాంటి ఇళ్లను కూలగొడితే వాళ్ల ఆశలను కూలగొట్టినట్లే.

హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా మూసీ తో సంబంధం లేదని ప్రకటన చేశారు.

మరి ఎందుకు మార్కింగ్ చేశారు. పీకనీకి ఈ మార్కింగ్ చేశారా?

మీరు సంఘటితంగా ఉంటేనే ఈ ప్రభుత్వంతో మనం కొట్లాడగలం. ఒక్కరికి సమస్య వచ్చిన సరే అందరూ రావాలె.

18 వేల ఇళ్లు అంటున్నారు. ఏ ఒక్కరి ఇళ్లు కూడా కూల్చనివ్వం.

పేదల ఇళ్లు కూల్చి…పెద్ద, పెద్ద మాల్స్ కడుతావా?

ఏదైనా పనిచేసే ముందు ప్రభుత్వానికి ఆలోచన ఉండాలె.

రూ. 5 వేలు ఇస్తే మీరు మాట్లాడుతున్నారని అంటున్నారు. సిగ్గు లేకుండా ఓ మంత్రి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నాడు.

మీ వెనుక బడా బిల్డర్లు ఉన్నారని పిచ్చి ప్రకటనలు చేస్తున్నారు. మీలో ఎవరైనా డబ్బుల కోసం మాట్లాడుతున్నారా?

అవసరమైతే బయటనుంచి కూడా ప్రజలను తీసుకొచ్చి మీకు అండగా మేము నిలబడతాం.

రేవంత్ రెడ్డి నువ్వు మగాడివైతే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయ్.

కాంగ్రెస్ ప్రభుత్వమే భూ సేకరణ చట్టం తెచ్చింది.

మీకు చట్టాలు తేలవాలె. మా లీగల్ సెల్ తరఫున మీకు అవగాహన కల్పిస్తాం.

మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ప్రజల ఆక్రందనలను చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.

రేవంత్ రెడ్డి అన్నకు నాలుగు బెడ్ల రూమ్ ఇద్దాం. ఆయన ఇళ్లు మారతాడా చూద్దాం.

ప్రజల శక్తి ముందు ఎవ్వరైనా తలవంచాల్సిందే. మీకోసం మేము బుల్డోజర్లకు అడ్డుగా నిలుస్తాం.

రైతుల శక్తి ముందు మోడీ ప్రభుత్వమే మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది.

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం. మీరు ఒక్క పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.