సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే ఐదు కోట్లు ఇవ్వాలి… సల్మాన్ కు బెదిరింపులు
ఇటీవల ఎన్సీపీ నేత సల్మాన్ ఖాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేశారు. గుర్తు తెలి యని దుండగులు. దీంతో వెంటనే అలెర్ట్ అయిన ముంబై పోలీసులు, ఈ సంఘటన తో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులువచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ. 5కోట్లు ఇవ్వాల్సిందేనంటూ అగంతకులు బెదిరింపులకు దిగారు.
ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నెంబర్ కు గురువారం రాత్రి బెదిరింపు మెసేజ్ రావడంతో పోలీసు లు అలర్ట్ అయ్యారు. ఈ బెదిరింపులను తేలికగా తీసుకోకూడదని..
సల్మాన్ ఖాన్ ప్రాణాలతో ఉండాలన్నా..లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగుతో శత్రుత్వాన్ని ముగించుకో వాలన్నా ఆయన రూ. 5కోట్లు చెల్లించాలని..ఈ డబ్బులు ఇవ్వనట్లయితే మాజీ ఎమ్మెల్సీ సిద్దిఖీ కంటే దారుణంగా హతమార్చు తామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నా కోణంలో విచారణ చేపడతామని ముంబై పోలీసులు వెల్లడించారు..