కొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్న హైడ్రా… మరో ఆపరేషన్‌కు రెడీ…!!!
ఆక్రమణలపై బుల్డోజర్లతో విరుచుకుపడ్డ హైడ్రా…
ఇప్పుడు ఫుట్‌పాత్‌లపై ఫోకస్ పెట్టింది. ట్రాఫిక్ విభాగంతో దోస్తీ కట్టి..
ట్రాఫిక్ జామ్‌కు స్వస్తి పలికేందుకు పూనుకుంది…!
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంతో కలిసి పని చేయాలని నిర్ణియించింది హైడ్రా. ట్రాఫిక్ సమస్యకు ఫుట్‌పాత్‌ల ఆక్రమణ కూడా ఓ కారణంగా భావిస్తున్న హైడ్రా.. ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసింది. త్వరలోనే ఆపరేషన్ ఫుట్ పాత్‌ను స్టార్ట్ చేయనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ కమిషనర్ విశ్వప్రసాద్ సమావేశమయ్యారు.
ట్రాఫిక్ సమస్య సహా ఫుట్‌పాత్ ఆక్రమణలపై చర్చించారు. ఎక్కడెక్కడ ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురయ్యాయో గుర్తించి, ఆక్రమణదారులకు నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత బుల్డోజర్లతో వెళ్లి కూల్చేయనున్నారు. కేవలం ఫుట్‌పాత్‌పై ఆక్రమణలే కాదు..
ఆ ఫ్లేస్‌లో ప్రభుత్వానికి చెందిన ఎలాంటి షాపులున్నా, ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేయనున్నారు.