పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు

పోలీసుల కనుసన్నల్లో ప్రభుత్వ దావఖానలు

హైదరాబాద్ :

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య సిబ్బంది భద్రతపై ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బందికి కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం తీసుకోని గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సిసి కెమెరాలను స్థానిక పోలీస్ స్టేషనులకు అనుసంధించాలని మంత్రి ఆదేశించారు..

ఆయా సీసీ కెమెరా ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే ప్రతి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తారు. అనుమానంగా కనిపించే వారిపై నిఘా పెడతారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేట్ల వద్ద స్కీనింగ్, సీసీ కెమెరాలతో చెకింగ్, లాంటి వ్యవస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.