పాలకుర్తి పోలీస్ స్టేషన్ ముందు నిప్పంటించుకున్న యువకుడు
జనగామ జిల్లా :
జనగామ జిల్లా పాలకుర్తి పోలీస్ స్టేషన్ లోఈరోజు మధ్యాహ్నం సిబ్బంది అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన జరిగింది.
భార్యాభర్తల పంచాయతీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వ్యక్తి అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. అతన్ని అడ్డుకుబోయిన పోలీసులకు ఆ నిప్పoటుకుని తీవ్ర గాయాలపాలయ్యారు. దీంతో స్పందించిన తోటి సిబ్బంది హుటాహుటీన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
పాలకుర్తి మండలం కొండాపురం గ్రామ శివారు మేకలతండాకు చెందిన లాకవత్ శీను – అతని భార్య రాధిక మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు చెలరేగుతు న్నాయి. భర్త వేధింపులు భరించలేక మనోవేధన గురైన రాధిక పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో శ్రీనును పోలీసులు పాలకుర్తి పోలీస్ స్టేషన్ పిలిపించారు. భార్యాభర్తలిద్దరికీ కౌన్సి లింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ఊగిపోయిన శ్రీనివాస్ తన వాహనంలోని పెట్రోలు తీసి తన ఒంటిపై పోసుకున్నాడు.
అంతటితో ఆగకుండా వెంటనే నిప్పుంటించుకున్నాడు.అయితే ఇదంతా పోలీసుల ముందే జరగడంతో వెంటనే అప్రమత్తమ య్యారు. కాపాడబోయిన ఎస్సై సాయి ప్రసన్న కుమార్, కానిస్టేబుల్ రవీందర్‌కు ఆ మంటలు అంటుకున్నాయి.
ఎస్సై సాయి ప్రసన్నకుమార్ చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ రవీందర్ చేతులు, కాళ్ళకు నిప్పు అంటుకుంది. గాయాలపాలైన శ్రీనుతోపాటు ఇద్దరు పోలీస్ సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
పాలకుర్తి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శీను జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.