గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే… హైకోర్టు

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే… హైకోర్టు

ఈనెల 21 నుంచి పరీక్షల నిర్వహణ

హైదరాబాద్ :

ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న గ్రూప్ వన్ అభ్యర్థుల కల నెరవేరునుంది, మెయిన్స్ పరీక్షలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలం గాణ గ్రూప్ 1 పరీక్షలకు దాఖలైన్ పిటిషన్లను తెలంgగాణ హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది.

దీనితో షెడ్యూల్ ప్రకారమే ఈనెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమ్స్ లోని 7 ప్రశ్నలకు ఫైనల్ కీలో సరైన జవాబులు ఇవ్వలేదని ఏడు ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్ల జాబితా ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేయారు. వాటిని హైకోర్టు కొట్టివేసింది.

2022లో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేసేం దుకు మరో నోటిఫికేషన్ జారీ చెల్లదని.. ప్రాథమిక” కీ”లో తప్పులున్నాయ ని..వాటిని సవరించాలన్న అభ్యంత రాలను కూడా పట్టించుకో లేదని పిటిషన ర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.

గతంలో గ్రూప్ 1 నియామ క పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ ఇదే హైకోర్టు పరీక్షను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వందల పోస్టులను భర్తీ చేయడానికి నిర్వహి స్తున్న పరీక్షలకు లక్షల మంది ప్రిలిమ్స్ రాశార ని..టీజీపీఎస్సీ వెలువ రించిన ఫైనల్ కీలో కూడా 7 ప్రశ్నలకు సమాధానాలు తప్పుగా ఉన్నాయని పిటిషన్ల తరపు న్యాయ వాదులు వాదించారు.

ఈ ప్రశ్నలను తొలగించి తాజా కీ”ని రూపొందించి అభ్యర్ధుల జాబితాను రెడీ చేయాలని కోరారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన 3 లక్షల మంది అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు కోరారు. 721 మంది భౌతికంగా, 6470 అభ్యంతరాలను ఆన్ లైన్లో స్వీకరించినట్లు టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

అభ్యంతరాలన్నింటినీ సబ్జెక్టుల వారీగా నిపుణుల కమిటీకి పంపించిన వారి ఆమోదం తర్వాత ఫలి తాలు విడుదల చేసినట్లు చెప్పారు.