మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడిన అంశాలను కౌంటర్ చేస్తూ, పూర్తి వివరాలతో తెలంగాణ భవన్‌లో ప్రజెంటేషన్ ఇచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR
ఈ సందర్భంగా కేటీఆర్ కామెంట్స్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూసీ పరివాహాక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు
జేసీబీలతో ఇళ్లు కూలగొట్టారు. కూలీలతో ఇళ్లను కూలగొట్టించారు. ఆ విషయాన్ని ఓ కూలీయే చెప్పాడు
ప్రాజెక్టుకు సంబంధించి అంచనాను రూ. 50 వేల కోట్ల నుంచి రూ. లక్షన్నర కోట్ల వరకు అన్ని పచ్చి అబద్ధాలే
మూసీ బ్యూటీఫికేషన్ కాదు ఇది లూటీఫికేషన్ అని ప్రజలకు తెలియటంతో తప్పును కప్పి పుచ్చుకోవటానికి నానా ఇబ్బంది పడిపోతున్నాడు
మూసీ పేరుతో లక్షన్నర కోట్ల దోపిడీ చేసే ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటోంది
ముఖ్యమంత్రికి మూసీ మీద ప్రేమ అంత కూడా ఢిల్లీకి మూటలు పంపించేందుకే
బడేభాయ్ నోట్ల రద్దుపై రోజుకో కారణం చెప్పినట్టు.. ఛోటే భాయ్ కూడా మూసీపై రోజుకో కారణం చెబుతున్నాడు
అసంబద్ధంగా, ఆనాలోచితంగా తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఎంతటి అనర్థాలు జరిగాయో గుర్తు చేస్తున్నాను
మూసీ విషయంలోనూ ఇదే విధంగా ఆనాలోచితంగా, అసంబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు
రూ. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామని రేవంత్ రెడ్డియే అన్నారు
మళ్లీ గజిని మాదిరిగా రూ. లక్షన్నర కోట్లు అన్నది ఎవ్వరూ అని అంటున్నాడు
ఒక రోజు బ్యూటీఫికేషన్, ఒక రోజు క్లీనింగ్, ఒకరోజు పునరుజ్జీవనం, ఒక రోజు నల్గొండకు మంచి నీళ్లు అంటూ రోజుకో మాట మాట్లాడుతున్నారు
గతంలో మేము మూసీ ప్రక్షాళన కోసం చాలా పనులు చేపట్టాం
1908లో అతిపెద్ద ఉప్పెన, వరద రావటంతో హైదరాబాద్‌లో 15 వేల మంది చనిపోయారు.
దీంతో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ గారు హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి సలహా కోరారు.
అప్పుడు ఆయన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను నిర్మించాలని చెప్పారు.
హైదరాబాద్‌లో వరదల కారణంగా ఇబ్బంది తలెత్తకుండా సిటీకి రక్షణ కవచంలా ఈ రెండు జలాశయాలను నిర్మించారు.
ఆ తర్వాత మూసీ విషయంలో ఏ ప్రభుత్వం కూడా మళ్లీ అంత గొప్పగా పనిచేయలేదు.
హైదరాబాద్‌లో ఉన్న నాలాలా ద్వారా 90 శాతానికి పైగా మురికి నీళ్లు, వాన నీళ్లు మూసీలోకే వస్తాయి.
వరద నివారణకు, ప్రాణనష్టం లేకుండా ఉండేందుకు ఉస్మాన్.